జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఎరువులను అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హెచ్చరించారు. భైంసా పట్టణంలో డీఏపీ ఎరువులను నిర్ణీత ధర కంటే ఎక్కువకు విక్రయించిన ఘటనపై వ్యవసాయ శాఖ అధికారుల నివేదిక ఆధారంగా సంబంధిత డీలర్ లైసెన్సును సస్పెండ్ చేసినట్లు ఆయన సోమవారం వెల్లడించారు.
ఈ క్రమంలో కొందరు వ్యాపారులు డీఏపీ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో సంబంధిత డీలర్‌పై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
రైతులకు అధిక ధరలు వసూలు చేయడం, నకిలీ విత్తనాల విక్రయం వంటి చర్యలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని స్పష్టం చేశారు.
జిల్లాలోని అన్ని ఎరువుల దుకాణాలు, విత్తన విక్రయ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.












