ట్రెడ్ లైసెన్సుల రెన్యువల్ పేరుతో మోసగాళ్ల దూకుడు – మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక

ట్రేడ్ లైసెన్సుల మోసం చిలకలూరిపేటలో"
  • మున్సిపల్ కమిషనర్ పేరుతో వ్యాపారులకు ఫోన్ కాల్స్
  • ట్రేడ్ లైసెన్సుల రెన్యూవల్ కింద మోసగాళ్లు డబ్బులు వసూలు
  • 6300805117 నంబర్‌ ద్వారా ఫోన్ చేసి బెదిరింపు
  • మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు స్పందన – పోలీసులకు ఫిర్యాదు
  • వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి

 

చిలకలూరిపేట పట్టణంలో ట్రేడ్ లైసెన్సుల రెన్యూవల్ పేరుతో మోసగాళ్లు వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు. తాము మున్సిపల్ కమిషనర్ అంటూ వ్యాపారస్తులకు ఫోన్ చేసి “లైసెన్సులు రీన్యూవ్ చేయకపోతే దుకాణాలను సీజ్ చేస్తాం” అని బెదిరిస్తున్నారు. దీంతో వ్యాపారులు అతను సూచించిన నంబర్‌కు ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు.

ఈ విషయం మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు దృష్టికి రావడంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియాతో మాట్లాడుతూ, వ్యాపారులు 6300805117 నంబర్ నుండి వచ్చే కాల్స్‌ నమ్మొద్దని, ట్రేడ్ లైసెన్సు రెన్యూవల్ కోసం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చెల్లించాల‌ని హెచ్చరించారు. మోసగాళ్ల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్సుల రెన్యూవల్ పేరిట ఓ ముఠా మోసాలు చేస్తోంది. వ్యాపారులకు “మున్సిపల్ కమిషనర్‌గా మాట్లాడుతున్నాను” అని చెప్పి, లైసెన్సులు రీన్యూవ్ చేయకపోతే దుకాణాలను సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇందులో భాగంగా మోసగాళ్లు 6300805117 నంబర్ ద్వారా ఫోన్ చేసి, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించాలని కోరుతున్నారు.

ఈ విషయాన్ని గుర్తించిన మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, “మున్సిపల్ శాఖ ఎప్పుడూ వ్యక్తిగతంగా ఫోన్ చేసి లైసెన్సు చెల్లించమని కోరదు. ట్రేడ్ లైసెన్సు రీన్యూవల్‌కు అధికారిక వెబ్‌సైట్‌ లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలి” అని స్పష్టం చేశారు.

ఇటువంటి మోసాలకు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాల‌ని ఆయన సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment