బీఆర్‌ఎస్ కార్యకర్తకు పరామర్శ
మనోరమ హాస్పిటల్‌లో రంజిత్‌ను పరామర్శించిన విఠల్‌రావు
నిజామాబాద్ / మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి
ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం ముదెల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త రంజిత్‌పై ఇటీవల అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న ఆయన ఆదివారం నిజామాబాద్‌లోని మనోరమ హాస్పిటల్‌ను సందర్శించి చికిత్స పొందుతున్న రంజిత్‌ను పరామర్శించారు. అనంతరం అతనికి వైద్యం అందిస్తున్న డాక్టర్ హరికృష్ణ రెడ్డిని కలసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నెఫ్రాలజిస్ట్‌గా చికిత్స అందిస్తున్న వైద్యులు, బాధితుడిని 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాతే పూర్తి వివరాలు చెప్పగలమని వైద్యులు వెల్లడించారు.ఈ సందర్భంగా విఠల్‌రావు మాట్లాడుతూ…“ప్రజాస్వామ్య దేశంలో పుట్టి రాజకీయ ఓటమిని జీర్ణించుకోలేక అహంకారపూరితంగా దాడులు చేయడం ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు. ఇలాంటి దాడులను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ మహేందర్ రెడ్డి, నగర అధ్యక్షులు సిర్ప రాజు, కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు రమణారావు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చింతకాయల రాజు, రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు, ఇంటెలిజెన్స్ ఎస్సై జీవన్‌రావు తదితరులు పాల్గొన్నారు.