రాష్ట్రాలపై కేంద్రం అదనపు భారం – ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్

రాష్ట్రాలపై కేంద్రం అదనపు భారం
– ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్

నిర్మల్, జనవరి 01 (మనోరంజని తెలుగు టైమ్స్):
రాష్ట్రాలపై కేంద్రం అదనపు భారం
– ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రజా సంక్షేమ పథకాలలో రాష్ట్రాల హక్కులను దశలవారీగా హరిస్తూ, రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్రేగా) పేరును మార్చి **‘భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్’**గా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని తెలిపారు. కేవలం పేరు మార్పే కాకుండా, పథకంలో సమూల మార్పులు చేసి, గతంలో కేంద్ర ప్రభుత్వం భరించిన వాటాను తగ్గిస్తూ రాష్ట్రాలపై అదనపు భారం మోపుతోందని మండిపడ్డారు.గతంలో ఎంజీఎన్రేగా కింద కేంద్రం–రాష్ట్రాల వాటా 75:25గా ఉండగా, ఇప్పుడు దాన్ని 60:40కి మార్చడం ద్వారా రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారని చెప్పారు. ఈ విధానాల వల్ల రాష్ట్రాలపై సుమారు రూ.1300 కోట్ల వరకు అదనపు భారం పడుతోందని తెలిపారు.
జాతీయ మిషన్ అమలులో భాగంగా కేంద్రం నుంచి రూ.985.34 కోట్లు విడుదల కావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ.176.5 కోట్లు మాత్రమే విడుదల చేశారని విమర్శించారు. అలాగే గతంలో ఐసీడీఎస్ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు భరించేదని, ప్రస్తుతం వాటిని 60 శాతానికి తగ్గించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, విద్య వంటి కీలక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం కోతలు విధించడం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గ్రామీణ సడక్ యోజన పథకంలో గతంలో కేంద్రం 90 నుంచి 100 శాతం నిధులు భరించేదని, ప్రస్తుత నిబంధనల ప్రకారం దానిని 60:40కి తగ్గించడం అన్యాయమని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాలను పునఃసమీక్షించి, రాష్ట్రాలపై అదనపు భారం పడకుండా తగ్గించిన నిధుల శాతాలను పూర్వ స్థితికి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment