ఖానాపూర్, 2026-06-05
ఖణగృగగగఘభ(85)ృెళగెె
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్లో నివాసం ఉంటున్న రాజుల దేవి భూదేవి (85) పై కోతుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో ఆమె రెండు కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
కోతుల బెడద నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి
ఈ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, కోతుల శాశ్వత నివారణకు కృషి చేయాలని ప్రజలు ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












