లక్ష్మణ్ చందా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 27
లక్ష్మణ్ చందా మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాబాపూర్ - వడ్డేపల్లి మధ్య ప్రధాన రహదారిపై ఆటో అదుపుతప్పి వరి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
లక్ష్మణ్ చందా మండలంలోని బాబాపూర్ - వడ్డేపల్లి మధ్య ప్రధాన రహదారిపై ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న వరి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆటో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్నవారు బురదలో చిక్కుకున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, రైతులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బయటకు లాగి కాపాడారు.
వెంటనే 108 వాహనానికి సమాచారం అందించగా, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












