ఖానాపూర్, జూలై 19
ఖానాపూర్ మండలంలోని బీర్ నంది రహదారిలో కులంగూడకు వెళ్లే మార్గంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ బైక్, కంకరాతో వెళుతున్న టిప్పర్ వాహనాన్ని ఢీకొనడంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు.
ఖానాపూర్ మండలంలోని బీర్ నంది రహదారిలో కులంగూడకు వెళ్లే మార్గంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ బైక్, కంకరాతో వెళుతున్న టిప్పర్ వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న కొడాలి రాజేశ్వర్, అతని భార్య కొడారి రాజమానికి గాయాలయ్యాయి.
ప్రమాద సమాచారం అందిన వెంటనే 108 సిబ్బంది మురళి, వసంత్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తక్షణమే స్పందించి గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.












