బల్దియా టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ సోదాల అలజడి

బల్దియా టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ సోదాల అలజడి

అక్రమ కట్టడాలకు అనుమతుల పేరుతో భారీ అవినీతి ఆరోపణలు

మనోరంజని తెలుగు టైమ్స్ – నిజామాబాద్ ప్రతినిధి

నిజామాబాద్ నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక సోదాలు నిర్వహించడంతో, మున్సిపల్ అధికారుల వర్గాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ప్రధాన ద్వారం మూసివేసి సోదాలు

ఉదయం గంటలలోనే ఏసీబీ అధికారులు మూడువైపులా చేరుకుని, టౌన్ ప్లానింగ్ కార్యాలయంలోకి ప్రవేశించి, ప్రధాన ద్వారం లోపల నుంచే గడియపెట్టి సోదాలు ప్రారంభించారు. లోపల ఉన్న అధికారుల మొబైళ్ళను స్వాధీనం చేసుకుని, పత్రాలు–ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

వరుసగా అవినీతి ఆరోపణలు

ఇటీవలి కాలంలో కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతుల ముసుగులో భారీ మామూలు వసూలు జరుగుతోందని, టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో కొంతమంది అధికారులు ఈ వ్యవహారాలకు వత్తాసు పలుకుతున్నారని వచ్చిన వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ సోదాలు జరిపినట్లు సమాచారం. అనుమతులు మంజూరు చేయడంలో భారీ లావాదేవీలు జరిగుతున్నాయనే ప్రజల ఆరోపణలు కూడా ఉన్నాయని వర్గాలు వెల్లడిస్తున్నాయి.పూర్తి వివరాలు త్వరలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయి వివరాలు ఏసీబీ అధికారులు కొద్దిసేపట్లో వెల్లడించే అవకాశం ఉంది. ఈ అనూహ్య చర్యతో మున్సిపల్ శాఖలోపల భయాందోళనలు చెలరేగినట్టు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment