బ్రెయిన్‌ స్ట్రోక్‌తో బాధపడుతున్న కామోల్ గ్రామానికి చెందిన యువకుడికి సహాయం అవసరం

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో బాధపడుతున్న కామోల్ గ్రామానికి చెందిన యువకుడికి సహాయం అవసరం

భైంసా మండలానికి చెందిన ముత్యం తీవ్ర అనారోగ్యంతో చికిత్సలో

నిజామాబాద్, హైదరాబాద్‌లో చికిత్సకు భారీ వ్యయం

ఆర్థిక ఇబ్బందులతో సహాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబం

మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా ప్రతినిధి నవంబర్ 02

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని కామోల్ గ్రామానికి చెందిన కే. ముత్యం గత నెల రోజులుగా బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధితో బాధపడుతున్నారు. మొదట నిజామాబాద్‌లోని మనోరమా హాస్పిటల్‌లో 15 రోజులు చికిత్స పొందగా, దాదాపు ₹6 లక్షలు వ్యయం అయ్యాయి. కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోంది.

ముత్యం భార్యతో పాటు ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. మెడిసిన్ కొనుగోలు చేయడానికి కూడా స్తోమత లేక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. స్థానికులు మరియు సామాజిక సేవకులు దయచేసి మీకు తోచినంత ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సహాయం అందించవలసిన వారు:
📱 GPay / PhonePe: 9010567407

మీ చిన్న సహాయం ఒక ప్రాణాన్ని నిలబెట్టగలదు.

Join WhatsApp

Join Now

Leave a Comment