ఎన్హెచ్ఆర్సి నగర ప్రధాన కార్యదర్శిగా ఏ. సుజాత నియామకం
నిజామాబాద్ జనవరి 13 (మనోరంజని తెలుగు టైమ్స్):
ఎన్హెచ్ఆర్సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర చేతుల మీదుగా ఏ. సుజాతకు నగర ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రం జారీ చేశారు.
ఈ సందర్భంగా నూతన నగర ప్రధాన కార్యదర్శి సుజాత మాట్లాడుతూ, ఎన్హెచ్ఆర్సి చేపట్టే ప్రతి కార్యక్రమంలో నీతి, నిజాయితీలతో వ్యవహరిస్తూ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగుతానని తెలిపారు. గతంలో ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం తనకు ఉందని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని పేర్కొన్నారు.
నాపై నమ్మకంతో నగర ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రం జారీ చేసినందుకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్యకు, జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్రకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాల్వేకర్ ధర్మేంద్రతో పాటు వేణు, సుజాత తదితరులు పాల్గొన్నారు.