అమ్మవారి దర్శనానికి భక్తులకు సౌకర్యార్థం చేయూత, డిఎస్పీ ర్యాంకు సాధించిన విద్యార్థిని సత్కారం

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
భైంసా, అక్టోబర్ 12, 2024

 

 

ఎల్లమ్మ గుట్టలో భక్తులకు సౌకర్యం

ఎల్లమ్మ గుట్టలో భక్తులకు సౌకర్యంఎల్లమ్మ గుట్టలో భక్తులకు సౌకర్యంఎల్లమ్మ గుట్టలో భక్తులకు సౌకర్యంఎల్లమ్మ గుట్టలో భక్తులకు సౌకర్యం

  • భక్తుల సౌకర్యార్థం ఐదు సిమెంటు బేంచీలను విరాళంగా అందజేసిన సైనికుడు ఆడెపు సాయినాథ్.
  • డిఎస్పీ ఫలితాల్లో 8వ ర్యాంకు సాధించిన సిరి మణి రజనీ కాంత్ కు ఘన సన్మానం.

నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్ పహాడ్ గ్రామానికి చెందిన ఆడెపు సాయినాథ్, ఎల్లమ్మ గుట్ట ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఐదు సిమెంటు బేంచీలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ, గ్రామస్తులు దంపతులను సత్కరించారు. అలాగే, డిఎస్పీ ఫలితాల్లో 8వ ర్యాంకు సాధించిన సిరి మణి రజనీ కాంత్‌ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్ పహాడ్ గ్రామానికి చెందిన ఆడెపు సాయినాథ్ దేశ సైనికుడిగా సేవలు అందిస్తున్నారు. అతను ఎల్లమ్మ గుట్ట ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం ఐదు సిమెంటు బేంచీలను విరాళంగా అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో సాయినాథ్, ఆయన సతీమణి ఆడెపు కళ్యాణిని ఘనంగా సత్కరించారు. జ్ఞాపకార్థం అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

అదేవిధంగా, ఇటీవల వెలువడిన డిఎస్పీ ఫలితాల్లో 8వ ర్యాంకు సాధించిన సిరి మణి రజనీ కాంత్ విజయాన్ని పురస్కరించుకుని, గ్రామంలోని ఉద్యోగులు, ప్రజలు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కడారి దశరథ్, సిరిమల్లి గణపతి, అట్టోలి భూమన్న, స్వామి, భోజరాం, అంజయ్య, రాంకుమార్, ముత్యం రెడ్డి, మహేష్, సిరిమణి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment