- పంజాబ్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన మమత
- ఆర్థిక సమస్యల కారణంగా పోటీలకు వెళ్లలేని పరిస్థితి
- దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్న కుటుంబం
నిర్మల్ జిల్లా తానూర్ మండలం మసల్గా గ్రామానికి చెందిన పెద విద్యార్థిని గైక్వాడ్ మమత జాతీయ స్థాయి బేస్బాల్ పోటీలకు ఎంపికైంది. ఆమె పంజాబ్ లో జరిగే ఈ పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక సాయము అవసరమవుతోంది. వికలాంగ తండ్రి గంగాధర్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండటంతో, దాతల సహాయం కోసం కుటుంబం ఎదురు చూస్తోంది.
నిర్మల్ జిల్లా తానూర్ మండలం మసల్గా గ్రామానికి చెందిన గైక్వాడ్ మమత రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీల్లో తన ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ప్రస్తుతం ఆమె సారంగాపూర్ మండలంలోని జామ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. మమత విద్యాభ్యాసంతో పాటు ఆటపాటల్లోనూ రాణిస్తూ, రాష్ట్ర స్థాయి పోటీల్లో విశేష ప్రతిభ కనబర్చింది.
తండ్రి గంగాధర్ వికలాంగుడు కావడం, కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండటంతో మమత పంజాబ్ లో జరిగే జాతీయ స్థాయి బేస్బాల్ పోటీలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కుటుంబ సభ్యులు దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మమతకు ఆర్థిక చేయూత అందించాలని కోరుతున్నారు.