ఆలయ పరిశుభ్రతకు ప్రత్యేక కార్యక్రమం
50 వారాలు పూర్తి చేసిన గో సేవా సమితి సేవలు అభినందనీయం
మనోరంజని తెలుగు టైమ్స్ – నిజామాబాద్, నవంబర్ 29
నిజామాబాద్ నగరంలో ప్రారంభించిన ‘ఆలయ పరిశుభ్రత – ప్రాంగణ పరిశుభ్రత’ కార్యక్రమం 50 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాబోయే దత్త జయంతిను పురస్కరించుకొని, శనివారం 100 ఫీట్ల రోడ్డులో గల దత్తాత్రేయ ఆశ్రమంలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇందూరు గో సేవా సమితి అధ్యక్షులు వీరమల్లి రమేష్ మరియు వారి బృందం చేపట్టారు. నగరంలోని పలు దేవాలయాల్లో గత 50 వారాలుగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించిన తమ సేవలు శనివారం దత్తాత్రేయ ఆశ్రమానికి చేరుకోవడం ఆనందదాయకమని తెలిపింది ఆశ్రమ నిర్వాహకులు ఇప్పకాయల హరిదాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—“గత 50 వారాలుగా వివిధ దేవాలయాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తూ దేవాలయాలను ధర్మదైన శైలిలో మెరిసేలా చేసినందుకు గో సేవా సమితి సభ్యులందరికీ పేరుపేరునా అభినందనలు. దత్త జయంతి సందర్భంగా పరిశుభ్రత చేపట్టడం హర్షణీయం,” అని పేర్కొన్నారు. రాబోయే దత్త జయంతి రెండు రోజులపాటు వైభవంగా జరగనున్నందున, భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గో సేవా సమితి సభ్యులు, ఆలయ పరిశుభ్రత కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు..