సాయి సుప్రియ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స
మహిళ కడుపు నుంచి 12 కిలోల కణితి తొలగింపు
మనోరంజని తెలుగు టైమ్స్ – భైంసా, నవంబర్ 29
భైంసా పట్టణంలోని సాయి సుప్రియ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది. ఓ మహిళ కడుపులో పెరిగిన 12 కిలోల భారీ కణితిని వైద్యులు శుక్రవారం శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఓవైసీ నగరానికి చెందిన ఆ మహిళ గత కొన్నేళ్లుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ డాక్టర్ రజనీకాంత్ తోటవార్‌ను సంప్రదించారు. పరిశీలనలో గర్భాశయానికి ఆనుకుని ఉన్న భారీ కణితి బయటపడింది. శస్త్రచికిత్స నిపుణులు రజనీకాంత్ తోటవార్, అపూర్వ గైనకాలజిస్టుల బృందం కలిసి రెండు గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి కణితిని విజయవంతంగా తొలగించారు.
భైంసా ప్రాంతంలో ఇటువంటి భారీ కణితిని తొలగించడం మొదటిసారి అని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నో ఏళ్లుగా బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స జరగడంతో కుటుంబ సభ్యులు వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు.