వాగులో ప్రమాదవశాత్తు పడి వ్యక్తి మృతి

Alt Name: ప్రమాదవశాత్తు వాగులో పడి వ్యక్తి మృతి - బైంసా, నిర్మల్ జిల్లా
  • బైంసా మండలం బిజ్జూరు గ్రామ శివారులో మత్తడి వాగులో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
  • మృతుడు కుబీర్ మండలం రంగశివుని గ్రామానికి చెందిన జాదవ్ అరవింద్ (25)
  • బైంసా సీఐ, రూరల్ ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో సహా సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని వెలికితీశారు

 Alt Name: ప్రమాదవశాత్తు వాగులో పడి వ్యక్తి మృతి - బైంసా, నిర్మల్ జిల్లా

: బైంసా మండలం బిజ్జూరు గ్రామ శివారులోని మత్తడి వాగులో చేపలు పట్టడానికి వచ్చిన జాదవ్ అరవింద్ (25) ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి మృతిచెందాడు. బైంసా సీఐ నైలు, రూరల్ ఎస్సై శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని, గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

: నిర్మల్ జిల్లా, సెప్టెంబర్ 04, 2024 – బైంసా మండలం బిజ్జూరు గ్రామ శివారులో మత్తడి వాగు వద్ద బుధవారం చేపలు పట్టడానికి వచ్చిన కుబీర్ మండలం రంగశివుని గ్రామానికి చెందిన జాదవ్ అరవింద్ (25) ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి మృతి చెందాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న బైంసా సీఐ నైలు, రూరల్ ఎస్సై శ్రీనివాస్, సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని, బాసర నుండి గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం మృతదేహాన్ని బైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

జాదవ్ అరవింద్‌కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుగుతుందని బైంసా రూరల్ ఎస్సై జి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన, ఎడతెరిపిగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, చెరువులు నిండుగా ఉన్నాయని, చేపలు పట్టడానికి వాగులు చెరువుల వైపు ఎవరు వెళ్ళద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment