ఉల్లాసంగా కొనసాగిన ఫుడ్ ఫెస్టివల్
ఎమ్4 ప్రతినిధి ముధోల్
ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఉత్సవంలో 83 మంది విద్యార్థులు ఉత్సాహంగా రకరకాల వంటకాలు చేసుకుని తెచ్చారు. విద్యార్థులు తీసుకువచ్చిన వంటకం పేరు, దానికి కావలసిన పదార్థాలు, అది తయారు చేయు విధానం గురించి వివరించారు. అనంతరం వంటకాలను తోటి విద్యార్థులకు పంచిపెట్టారు. ఈ ఉత్సవంలో ఆదిలాబాద్ విభాగ్ సహా కార్యదర్శి సరుకొండ దామోదర్, పోషకులు, ఆచార్యులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషకులు సంతోషాన్ని వ్యక్తం చేసి విద్యార్థుల వంటకాల రుచి చూసి విద్యార్థులను అభినందించారు.