ధర్మారెడ్డి గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గానికి ఘన సన్మానం
కామారెడ్డి, (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి): డిసెంబర్ 15
కామారెడ్డి జిల్లా ధర్మారెడ్డి గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లక్ష్మీ, ఉప సర్పంచ్ జైరాజ్‌తో పాటు వార్డు సభ్యులకు సోమవారం ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, మాజీ జడ్పీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, నూతన పాలకవర్గాన్ని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ—గ్రామాభివృద్ధి కోసం నూతన పాలకవర్గం సమిష్టిగా పనిచేయాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పాలన సాగించాలని సూచించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఆదర్శ గ్రామంగా ధర్మారెడ్డిని తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.