నూతన సర్పంచ్‌కు ఘన సన్మానం

నూతన సర్పంచ్‌కు ఘన సన్మానం

బాసర, జనవరి 11 మనోరంజని తెలుగు టైమ్స్

నిర్మల్ జిల్లా బాసర గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్‌కు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల అపారమైన మద్దతుతో భారీ మెజారిటీ సాధించిన ఆయనను సంఘ సభ్యులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పదాధికారులు, సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment