మద్యం మత్తులో డయల్ 100 సేవలను దుర్వినియోగం చేసిన వ్యక్తి పై కేసు .. ఎస్ఐ అజయ్
మనోరంజని ప్రతినిధి జనవరి 11 కుంటాల: మండల కేంద్రంలోని లింబ( కె) గ్రామానికి చెందిన వ్యక్తిపై కుంటాల పోలీసులు ఈ పెట్టి(e-petty) కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై అజయ్ వారు మాట్లాడుతూ సదరు వ్యక్తి మద్యం మత్తులో డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసులను ఇబ్బందులకు గురి చేశాడు ,ఎలాంటి అత్యవసర పరిస్థితులు లేకపోయినా కేవలం మద్యం మత్తులో విధి నిర్వహణలో ఉన్న పోలీసుల సమయాన్ని వృధా చేస్తూ వారి విధులకు అడ్డు తగిలాడు ఇందుకుగాను కుంటాల పోలీసులు ఆ వ్యక్తిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ నిర్వహించి హెచ్చరించారు. డయల్ 100 అనేది ఆపదలో ఉన్న వారికి కాపాడడానికి ఉద్దేశించిన అత్యవసర సేవా అని అన్నారు