శ్రీ బ్రహ్మరంభీక స్వామివారి దర్శనానికి గోపిడి గంగారెడ్డి కుటుంబ సమేతంగా
మనోరంజని తెలుగు టైమ్స్ – నర్సాపూర్, డిసెంబర్ ●
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని కూతవేటు సమీప గ్రామ శివారులో వెలసిన పుణ్యక్షేత్రం శ్రీ బ్రహ్మరంభీక స్వామి వారిని ఆదివారం మాజీ రైతు బంధు అధ్యక్షులు, ట్రాన్స్పెపెక్సీ డైరెక్టర్ గోపిడి గంగారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్బంగా గంగారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు పెట్టుకున్నారు. అనంతరం మాట్లాడుతూ—
“ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతలో ముందుకు సాగాలి. భక్తి మనసుకు శాంతిని అందిస్తుంది. ప్రజలు–రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం నిండాలని స్వామివారిని కోరుకున్నాను” అని తెలిపారు.
దర్శన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.