అన్నబహుసాటే అడుగుజాడల్లో నడుచుకోవాలి* *విగ్రహఆవిష్కరణ కార్యక్రమం లో ఎమ్మెల్యే రామరావ్ పటేల్*

*అన్నబహుసాటే అడుగుజాడల్లో నడుచుకోవాలి*
*విగ్రహఆవిష్కరణ కార్యక్రమం లో ఎమ్మెల్యే రామరావ్ పటేల్*

మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా ప్రతినిధి నవంబర్ 14
అన్నబహుసాటే అడుగుజాడల్లో నడుచుకోవాలి* *విగ్రహఆవిష్కరణ కార్యక్రమం లో ఎమ్మెల్యే రామరావ్ పటేల్*

సాహిత్య సామ్రాట్ అన్నబహు సాటే బోధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. శుక్రవారం బైంసాలో అన్నా బాహు సాటే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సాటే బోధనలు పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో న్యాయం చేశాయన్నారు. మహనీయుల మార్గదర్శకానుసారంగా నడుచుకుంటే సమాజాభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు చదువుతోనే అన్ని రంగాల్లో ముందు ఉండగలుగుతారని, చదువుకు ప్రాముఖ్యత ను ఇచ్చి పిల్లలు భవిష్యత్తులో మంచి స్థాయిలో స్థిరపడేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విగ్రహ కమిటీ వారికి ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించి, విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమని, ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. అన్నా బాహు సాటేకు భారతరత్న ఇచ్చేలా తన వంతుగా మద్దతు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతించి శాలువ తో సత్కరించారు. విగ్రహ ఆవిష్కరణ కంటే ముందు పాదయాత్రగా ఎమ్మెల్యే తో పాటు నాయకులు కమిటీ సభ్యులు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని పూల మాలవేసి నివాళులు అర్పించారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు గ్రామాలు నుండి ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment