విద్యార్థులకు పుస్తకాలు–పెన్నులు బహుకరించిన లోలం మురళి

విద్యార్థులకు పుస్తకాలు–పెన్నులు బహుకరించిన లోలం మురళి

మనోరంజని తెలుగు టైమ్స్ – ముధోల్, నవంబర్ 14:

ముధోల్ మండలంలోని అష్టా గ్రామ యువ నాయకుడు లోలం మురళి శుక్రవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—“నేటి బాలలే రేపటి భారత భవిష్యత్తు. చదువుతోనే ప్రతి లక్ష్యం సాధ్యమవుతుంది” అని విద్యార్థులకు సూచించారు.
అలాగే—“చదువులో తడబాట్లు వచ్చినా భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. అజ్ఞానాన్ని విడిచి జ్ఞాన మార్గం అనుసరించాలి” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment