సంబరాల్లో కాంగ్రెస్ – ప్రజా ప్రభుత్వానికే ప్రజల మద్దతు

సంబరాల్లో కాంగ్రెస్ – ప్రజా ప్రభుత్వానికే ప్రజల మద్దతు : మండల అధ్యక్షుడు రావుల గంగారెడ్డి

మనోరంజని తెలుగు టైమ్స్ ముధోల్, నవంబర్ 14:

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో ముధోల్ మండల కాంగ్రెస్ కార్యాలయంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి 24,658 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటును దక్కించుకోవడంతో కార్యకర్తల్లో ఉత్సాహం అలుముకుంది. ఈ విజయం సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రావుల గంగారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కలిసి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ విజయోత్సాహాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ—
“ఈ గెలుపు ప్రతిపక్షాలకు గట్టి చెంపపెట్టు. ఎన్నెన్ని మాయమాటలు చెప్పినా, ప్రజలు చివరకు కాంగ్రెస్‌నే ఆశ్రయించారు. ఇది ప్రజా పాలనకు ప్రజలిచ్చిన మద్దతు” అని అన్నారు.అలాగే—
“బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినా, ప్రజా తీర్పు ముందు ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రాబోయే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తుంది. జూబ్లీహిల్స్ ఫలితం భవిష్యత్తుకు సంకేతం” అని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థికఇబ్బందులను అధిగమిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని గంగారెడ్డి తెలిపారు.
“ఎంత దూషించినా, ఎంత దుష్ప్రచారం చేసినా, ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. ఈ విజయం కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది” అని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు గంగారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు రావుల శ్రీనివాస్, సీనియర్ నాయకులు ప్రేమ్ నాథ్ రెడ్డి, కిషన్ పతంగే, అజీజ్, సోషల్ మీడియా కన్వీనర్ నజీమ్, కిషన్ పటేల్, భుజంగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment