జిల్లా యువజన ఉత్సవాల్లో జామ్ విద్యార్థినుల ప్రతిభ

జిల్లా యువజన ఉత్సవాల్లో జామ్ విద్యార్థినుల ప్రతిభ

మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్, నవంబర్ 14:

నిర్మల్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నవంబర్ 13న జరిగిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు–2025లో సారంగాపూర్ మండలం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జామ్ విద్యార్థినులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థినులు జానపద నృత్యం, చిత్రలేఖనం విభాగాల్లో పాల్గొన్నారు. జానపద నృత్యాల్లో పాల్గొన్న బృందం ఆకట్టుకునే ప్రదర్శనతో మూడో స్థానం సాధించింది. విద్యార్థినుల ఈ విజయంపై పాఠశాల ప్రిన్సిపల్ బి. సంగీత మాట్లాడుతూ—
“మన విద్యార్థినులు జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరచడం గర్వకారణం. వారిని సన్నద్ధం చేసిన సిబ్బంది, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు” అని తెలిపారు.
పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినులను అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment