చిన్నారుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా నేడు చిల్డ్రన్స్ డే!
హైదరాబాద్:నవంబర్ 14
భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలంటే చాలామంది తమ బాల్యం తిరిగి ఇవ్వమని అడుగు దామని అనుకుంటారు. కానీ అది సాధ్యమా?భగవంతుడు ఇచ్చిన గొప్పవరం బాల్యం. చాలా దేశాల్లో బాలల దినోత్సవం నిర్వహిస్తుంటారు. భారతదేశంలో మాత్రం ఏటా నవంబర్ 14 న ‘బాలల దినోత్సవం’ జరుపుకుంటాం. చాచా నెహ్రూ జయంతి రోజున ఈ దినోత్సవం నిర్వహిస్తారు. ఈ రోజు ఆ మహానుభా వుడికి నివాళులు అర్పిద్దాం. బాలలందరికి శుభాకాంక్షలు చెబుదాం.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా పనిచేశారు జవహర్ లాల్ నెహ్రూ. ఆయన జన్మించిన రోజున బాలల దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం అందరికీ తెలి సిందే. స్వాతంత్ర్యోద్యమ కాలంలో నెహ్రూ చాలా జీవితం జైళ్లలోనే గడిపారు. ఆ సమయంలో తన ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శి నితో ఎక్కువకాలం గడపలే కపోయారట. నెహ్రూకి పిల్ల లన్నా, గులాబీ పూవులన్నా చాలా ఇష్టం. పిల్లలను జాతి సంపదలుగా నెహ్రూ చెబుతూ ఉండేవారు.
ఆయన పాలనలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన పుట్టినరోజున మన దేశంలో బాలల పండుగ నిర్వహిస్తున్నారు. ఈరోజు చాచా నెహ్రూను తలుచు కుని పిల్లలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహి స్తారు.1954 కి ముందు భారతదేశంలో అక్టోబర్ నెలలో బాలల దినోత్స వాన్ని నిర్వహించేవారు.
ఐక్యరాజ్యసమితి నిర్ణయిం చిన ప్రకారం మొదటిసారి 1954 లో ప్రపంచమంతటా నిర్వహించారు. 1989 లో పిల్లల హక్కులపై నవంబర్ 14 న ఐరాసా ఓ బిల్లును ఆమోదించింది. 191 దేశా లు ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకాలు పెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూవస్తున్నారు.
చైనాలో జూన్ 1 న, పాకిస్తాన్ లో నవంబర్ 20 న, జపాన్ లో మే 5 న, దక్షిణ కొరియాలో మే 5 న, పోలాండ్ లో జూన్ 1 న, శ్రీలంకలో అక్టోబర్ 1 న ఇలా ఆయా దేశాల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
బాలల దినోత్సవం చిన్నారులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన బాల్యం అందించే ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. పిల్లల హక్కులను ప్రోత్సహించ డం, వారి విద్య, శ్రేయస్సుకి పాటుపడటంతో పాటు, పోషకాహారం, ఇంట్లో సురక్షితమైన వాతావరణం అందించడం వంటి బాధ్యతలను గుర్తు చేస్తుంది. పేదరికం, నిరక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, బాల కార్మికులు గా మారడం వంటి పిల్లలు ఎదర్కుంటున్న సవాళ్లపై అవగాహన పెంచుతుంది.