వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలి – ఎమ్మెల్యే సూచనలు
మనోరంజని తెలుగు టైమ్స్ – భైంసా ప్రతినిధి, నవంబర్ 12
భైంసా మండలంలోని వాలేగాం గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్, మీర్జాపూర్ హెడ్‌క్వార్టర్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయనతో పాటు భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కనీస మద్దతు ధరను నిర్ణయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. క్వింటాలుకు గ్రేడ్ ‘A’ రకానికి రూ.2389, సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధరగా నిర్ణయించబడిందని చెప్పారు. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి తేమ శాతం 17% లోపే ఉండేలా చూసుకోవాలని సూచించారు. “రైతులకు నష్టం కాకుండా లాభం చేకూరే విధంగా అధికారులు సమన్వయం చేసుకోవాలి” అని ఎమ్మెల్యే ఆదేశించారు. కొనుగోలు కేంద్రం రైతులకు ఉపయోగకరంగా ఉండాలని, న్యాయమైన కొలతలు మరియు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, సీఈవో రాజేందర్, సెంటర్ ఇంచార్జ్ సాయినాథ్, మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఆకాష్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కే. దిగంబర్, బీజేవైఎం ఉపాధ్యక్షుడు గంగాప్రసాద్, మాజీ సర్పంచ్ శ్యామ్ రావు పటేల్, మాజీ ఎంపిటిసి మాణిక్యరావు పటేల్, మరియు రైతులు మారుతీ పటేల్, శంకర్ పటేల్, నీలాజి, పోతజి, ఎల్లన్న, రాజు, ప్రభాకర్ రెడ్డి, మాధవరావ్ పటేల్, బాబు, యోగేష్ తదితరులు పాల్గొన్నారు.