ఈ నెల 15న కామారెడ్డి బీసీ ఆక్రోశ సభ విజయవంతం చేయాలని పిలుపు
మనోరంజని తెలుగు టైమ్స్ – బాల్కొండ, నవంబర్ 12:
42% రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 15న కామారెడ్డిలో జరగనున్న బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని పిలుపు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఈ సభలో భారీగా పాల్గొనాలని నాయకులు కోరుతున్నారు. కమ్మర్పల్లి మండలంలో అన్ని గ్రామాల పరిధిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు ఆహ్వానం అందిస్తూ విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచార కార్యక్రమాన్ని కమ్మర్పల్లి మండల డీఎస్పీ అధ్యక్షులు నల్ల కైలాస్, మండల బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు మెరుగు నాగేశ్వరరావు, గుర్రం నరేష్, గుండోజి నవీన్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ —
“బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ప్రధాన ఉద్దేశం సామాజిక న్యాయం సాధన. అందరూ ఐక్యంగా ముందుకు రావాలి. ఈ నెల 15న కామారెడ్డి సత్య ఫంక్షన్ హాల్లో జరగనున్న బీసీ ఆక్రోశ సభకు పెద్దఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలి” అని పిలుపునిచ్చారు.