నాబార్డ్ సౌజన్యంతో మహిళలకు కటింగ్, కుట్టుట శిక్షణ

నాబార్డ్ సౌజన్యంతో మహిళలకు కటింగ్, కుట్టుట శిక్షణ

కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఎంఈడీపీ కార్యక్రమం ప్రారంభం

మనోరంజని తెలుగు టైమ్స్ – బాల్కొండ, నవంబర్ 12 (ప్రతినిధి గుర్రం నరేష్)

నాబార్డ్ సౌజన్యంతో మహిళలకు కటింగ్, కుట్టుట శిక్షణ


:
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో నాబార్డ్ వారి సౌజన్యంతో ఎంఈడీపీ (మైక్రో ఎంటర్‌ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్) శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మహిళలకు స్కూల్ యూనిఫార్మ్‌ల తయారీ, కటింగ్, కుట్టుట వంటి అంశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా నాబార్డ్ ప్రతినిధులు మాట్లాడుతూ — “గ్రామీణ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇలాంటి శిక్షణలు ఎంతో దోహదం చేస్తాయి. మహిళలు పొందిన నైపుణ్యాన్ని ఉపయోగించి స్వయం ఉపాధిని ఏర్పరచుకోవాలి. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి” అని సూచించారు. డ్వాక్రా సమాఖ్య నాయకులు మాట్లాడుతూ, “నాబార్డ్ సహకారంతో మహిళలకు నైపుణ్యాభివృద్ధి, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఇది ఒక మంచి వేదికగా నిలుస్తుంది” అన్నారు. శిక్షణలో పాల్గొన్న మహిళలు భవిష్యత్తులో స్వయంగా వ్యాపారాలు ప్రారంభించి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కిరణ్, సీసీ పిర్యా నాయకు, గంగా లలిత, రవి, మండల సమాఖ్య చైర్‌పర్సన్ రోజా, వాసవి, నాబార్డ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment