మెండోరా మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడోత్సవాలకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభం

మెండోరా మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడోత్సవాలకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభం

మెండోరా మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడోత్సవాలకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభం

క్రీడలు ఆరోగ్యానికి మూలం –

విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని పిలుపు

మనోరంజని తెలుగు టైమ్స్ – మెండోరా, నవంబర్ 12 (మండల ప్రతినిధి

మెండోరా మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడోత్సవాలకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభం

మెండోరా మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడోత్సవాలకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభంమెండోరా మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడోత్సవాలకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభం

మెండోరా మండల కేంద్రంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడోత్సవాలను బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. క్రీడలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ — “నా ఆధ్వర్యంలో ఏర్పాటైన కొత్త మండలంలో ఇలాంటి క్రీడలు ప్రారంభించడం ఆనందంగా ఉంది. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీడలు శరీర ఆరోగ్యానికి, మానసిక స్థైర్యానికి, రక్త ప్రసరణకు ఎంతో అవసరం. గెలుపు – ఓటమి సహజం; కానీ ప్రతి విద్యార్థి పట్టుదలతో క్రీడారంగంలో ముందుకు సాగాలి” అని అన్నారు. ప్రశాంత్ రెడ్డి క్రీడల నిర్వహణలో సహకరించిన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, యూత్ విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ, దాతలు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రీడల్లో ప్రథమ బహుమతి జిల్లా పరిషత్ హై స్కూల్, మెండోరా విద్యార్థులు సాధించగా, ద్వితీయ బహుమతి జిల్లా పరిషత్ హై స్కూల్, పోచంపాడు విద్యార్థులు గెలుచుకున్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్, మండల రెవెన్యూ అధికారులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, గ్రామ వి.డి.సి సభ్యులు, యూత్ ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, మండల టీఆర్ఎస్ నాయకులు, డీసీసీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, జడ్పీటీసీ తలారి గంగాధర్, ఎంపీపీ కమలాకర్, సొసైటీ చైర్మన్ రాజారెడ్డి, గ్రామ సర్పంచ్ రాజారెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment