రోడ్డు గుంతలు పూడ్చి వాహనదారుల ఇబ్బందులు తొలగించాలి
కల్లూరు–కుంటాల ప్రధాన రహదారిపై ప్రమాదకర గుంతలు – ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌కు ప్రజల విజ్ఞప్తి
మనోరంజని తెలుగు టైమ్స్ – కుంటాల, నవంబర్ 12:
నిర్మల్ జిల్లా కల్లూరు నుండి కుంటాల ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతల కారణంగా వాహనదారులు ప్రతిరోజూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ సమస్యను ప్రజలు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ దృష్టికి తీసుకువెళ్లారు. రహదారి గుంతలను పూడ్చి వాహనదారుల ఇబ్బందులను తొలగించాలని వారు విన్నవించారు. అదేవిధంగా, కుంటాల సహకార సంఘం పరిమితి ప్రాంగణంలో గ్రావెల్ వేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి, “త్వరలోనే అవసరమైన నిధులు మంజూరు చేస్తాను” అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జక్కుల గజేందర్, ఓడ్నం రమేష్, సట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.