ప్రముఖ గేయరచయిత అందెశ్రీ స్మరణలో భారతి ఛానల్ సాంబయ్య అనుభూతులు
“మీరు లేనిది మేము లేము” అని అందెశ్రీ సాంబయ్యను ప్రశంసించిన సందర్భం
స్మారకంగా పుస్తకం బహూకరించిన అందెశ్రీ
ఆయన ఆకస్మిక మరణ వార్తతో మానసికంగా కుంగిపోయిన సాంబయ్య
మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్ ప్రతినిధి నవంబర్ 10
ప్రముఖ గేయరచయిత, “జయహే తెలంగాణ” గీత రచయిత అందెశ్రీ ను స్మరించుకుంటూ భారతి ఛానల్ స్టాఫ్ సాంబయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో అందెశ్రీ మాట్లాడుతూ, “మేము కవులం, ఎన్నో గేయాలు రచిస్తాం కానీ వాటిని ప్రజల మధ్యకు తీసుకువెళ్తూ వారధిగా నిలిచేది మాధ్యమమే… మీరు లేనిది మేము లేము” అని సాంబయ్య అన్నారు. ఆ సందర్భంలో తన రచనలతో కూడిన ఒక పుస్తకాన్ని స్మారకంగా సాంబయ్య ను అందజేసి సత్కరించారు. ఆ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటూ సాంబయ్య , “అందెశ్రీ తో గడిపిన ఆ సందర్భాలు మరువలేనివి. సోమవారం ఉదయం ఆయన ఆకస్మిక మరణ వార్త విని మనసు తట్టుకోలేకపోతున్నాం. ఓ మహా వ్యక్తిని కోల్పోయామన్న బాధ మనలో మిగిలిపోయింది” అన్నారు.