దేశభక్తి మరియు ఐక్యతను చాటిన వందేమాతరం గీతం
కుంటాల మండలం పెంచికల్ పాడ్ గ్రామంలో సామూహిక వందేమాతరం గీతాలాపన
మనోరంజని తెలుగు టైమ్స్ కుంటాల ప్రతినిధి నవంబర్ 07
దేశభక్తి జ్వాలలు రగిలించిన కార్యక్రమం కుంటాల మండలంలోని పెంచికల్ పాడ్ గ్రామంలో జరిగింది. వందేమాతరం గీతం రచించబడిన 150 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ సామూహిక గీతాలాపన నిర్వహించారు. గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి గీతాలతో వాతావరణాన్ని ఉల్లాసభరితం చేశారు. వందేమాతరం — భారత జాతీయ గీతం, దీనిని బంకిం చంద్ర ఛటర్జీ రచించారు. ఈ గీతం భారత స్వాతంత్ర్య సమరయోధులకు స్ఫూర్తినిచ్చిన నినాదంగా నిలిచింది. దేశ భూమి, ప్రజలు, సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా ఇది నిలిచింది.బెంగాల్ విభజన వ్యతిరేకంగా జరిగిన స్వదేశీ ఉద్యమం సమయంలో ఈ గీతం అపారమైన ప్రజాదరణ పొందింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మచ్చేందర్,, పంచాయతీ కార్యదర్శి సారిక, యోగిత
ఉపాధ్యాయురాలు, గ్రామ ప్రజలు, బీజేపీ నాయకులు సాయి సూర్యవంశీ, నర్సయ్యా, ప్రవీణ్, శ్యాం, లింగురం, ఎల్లన్న, విద్యార్థులు పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో గ్రామం మార్మోగింది.