క్రీడల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

  • సోన్ మండలంలో 11వ జోనల్ స్థాయి క్రీడా పోటీల అట్టహాస ఆరంభం

  • విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, ఆత్మవిశ్వాసం పెంపు పిలుపు

  • గెలుపోటములు సహజమని కలెక్టర్ అభిలాష అభినవ్ వ్యాఖ్య

  • బాలికల భాగస్వామ్యాన్ని అభినందించిన అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

  • క్రీడల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్క్రీడల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్క్రీడల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్క్రీడల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడు గ్రామంలో 11వ రాష్ట్ర జోనల్ స్థాయి క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అట్టహాసంగా ప్రారంభించారు. క్రీడల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని, గెలుపోటములు సహజమని ఆయన సూచించారు. పోటీల్లో 1190 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు.

క్రీడల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్క్రీడల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్క్రీడల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడు గ్రామంలో తెలంగాణ బాలికల సాంఘిక సంక్షేమ విద్యాసంస్థలో 11వ రాష్ట్ర జోనల్ స్థాయి స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ 2025-26 క్రీడా పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

క్రీడల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడల ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. జోన్ పరిధిలో నాలుగు జిల్లాలకు చెందిన 1190 మంది విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొనబోతున్నారని వివరించారు. జీవితంలో గెలుపోటములు సహజమని, ఓటమి పట్ల నిరాశ చెందకుండా పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. బాలికలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలని ప్రోత్సహించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా సులభమవుతాయని వివరించారు.

క్రీడల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడల్లో అన్ని జాగ్రత్తలు పాటించి ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని కోరారు. బాలికల భాగస్వామ్యం పెరుగుతుండటం సంతోషకరమని పేర్కొన్నారు. సీఎం కప్ పోటీల్లో ఎక్కువ పతకాలు సాధించాలని విద్యార్థులను ఉత్సాహపరిచారు.

క్రీడల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ఈ సందర్భంగా విద్యార్థుల పరిచయ కవాతు, జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ వాలీబాల్ ఆడి క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈవో భోజన్న, డిఐఈఓ పరశురాం, డివైస్ఓ శ్రీకాంత్ రెడ్డి, తహసిల్దార్ మల్లేష్, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment