ఈ నెల 30న కాలేజీలు బంద్: SFI
తెలంగాణ : ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 30న విద్యా సంస్థలకు బంద్కు SFI పిలుపునిచ్చింది. బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని SFI రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ డిమాండ్ చేశారు. సర్టిఫికెట్ల కోసం ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అన్ని కాలేజీలు బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.