2001–2002 బ్యాచ్ ఆత్మీయ కలయిక
మనోరంజని తెలుగు టైమ్స్ – బాల్కొండ ప్రతినిధి, నవంబర్ 19
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్‌పల్లి గ్రామంలో స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో కలిసి విద్యనభ్యసించిన 2001–2002 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు బుధవారం గ్రామ శివారులో ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ స్కూల్ రోజుల జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచారు. తమ బాల్యం, తరగతి గదుల్లో జరిగిన సరదా సంఘటనలు, గురువుల గుర్తింపు, చదివిన రోజుల అనుభవాలు పంచుకుంటూ స్నేహబంధాన్ని మరింత బలపర్చుకున్నారు. అనంతరం అందరూ కలిసి పానీయాలు సేవించి, స్వయంగా వంటలు చేసుకుని ఆత్మీయ సమాగమాన్ని జరుపుకున్నారు.