రామేశ్వరంలో డాక్టర్ అబ్దుల్ కలాం మెమోరియల్ సందర్శన
కలాం ఆశయాలు యువతకు మార్గదర్శకం: ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి
రామేశ్వరం, (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):
తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో ఉన్న డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం మెమోరియల్ పార్కును తెలంగాణ మాజీ రాష్ట్ర జడ్పిటిసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం, ఆయన శాస్త్రీయ విజయాలు, దేశానికి అందించిన విశిష్ట సేవలను ప్రతిబింబించేలా ఈ మెమోరియల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలాం ఆశయాలు, నైతిక విలువలు యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.