: గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు

  • ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ శ్రీ దత్త సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించారు.
  • గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని అన్నారు.
  • అత్యవసర పరిస్థితుల్లో దూరం తగ్గిపోతుందన్నారు.

భైంసా: అక్టోబర్ 18,

ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ భైంసాలోని శ్రీ దత్త సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించారు. ఆయన అన్నారు, “గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రావడం శుభ పరిణామం.” ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండి, సమయానికి వైద్యం చేసుకోవాలని కోరారు.

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
భైంసా: అక్టోబర్ 18

గ్రామీణ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. ఆయన భైంసా పట్టణంలో శ్రీ దత్త సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రధాన పట్టణాలకు దీటుగా, స్థానికంగానే మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి,” అన్నారు. ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో దూర భారం తప్పించడమే కాకుండా, ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో చిన్నపాటి వైద్యం కోసం ప్రధాన పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది; కానీ ఇప్పుడు స్థానికంగానే వివిధ రకాల వ్యాధులకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో రావడం శుభ పరిణామమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు విజయ్ ఆనంద్, స్త్రీ వైద్య నిపుణురాలు వర్షా జాదవ్ పాల్గొన్నారు. ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటూ, సకాలంలో వైద్యం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు, వైద్య రంగ నిపుణులు, పట్టణ ప్రముఖులు, స్థానిక వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment