కత్తెర గుర్తుకు ఓటు ఇవ్వాలని కోరిన సర్పంచ్ అభ్యర్థి గడ్డం సుభాష్
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి – ముధోల్, డిసెంబర్ 11
సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న గంగామణి గడ్డం సుభాష్ గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో ఉప సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల ఆదరణ పొందినట్లు ఆయన గుర్తుచేశారు. అత్యవసర పరిస్థితుల్లో అనేక కుటుంబాలకు సహాయం అందించడం, రాత్రి పగలు తేడా లేకుండా ఆపదలో ఉన్నవారిని స్వంత వాహనంలో తరలించి ప్రాణాలు కాపాడిన సేవలను ప్రజలు గుర్తించాలని అన్నారు. కులమతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండే నాయకత్వం తనదేనని పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని, రాబోయే ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తిరిగి అవకాశం ఇస్తే మరింత సేవలందిస్తానని హామీ ఇచ్చారు.